వరుసగా మూడో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

Stock markets ends in losses for third straight session
  • 241 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 71 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 2.61 శాతం పతనమైన ఎం అండ్ ఎం షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టపోయాయి. చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటం, కొత్త వేరియంట్ పట్ల భారత ప్రభుత్వం అప్రమత్తం కావడం వంటిని మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. దీనికితోడు అమెరికా, ఐరోపాల్లో ఆర్థికమాంద్యం భయాలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. దీంతో, ఇన్వెస్టర్లు ఆచితూచి ట్రేడింగ్ చేశారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 241 పాయింట్లు కోల్పోయి 60,826కి పడిపోయింది. నిఫ్టీ 71 పాయింట్లు నష్టపోయి 18,127 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (0.71%), ఇన్ఫోసిస్ (0.68%), ఏసియన్ పెయింట్స్ (0.65%), కొటక్ బ్యాంక్ (0.58%), సన్ ఫార్మా (0.52%). 

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.61%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.55%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.26%), టాటా మోటార్స్ (-2.12%), ఎల్ అండ్ టీ (-1.70%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News