బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం!
- దేశంలో 7.98 శాతం పెరిగిన వార్షిక నోట్ల చలామణి
- గతేడాదితో పోలిస్తే ఈసారి పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
- క్రిప్టో ఏజెన్సీలకు చెందిన రూ. 907 కోట్ల ఆస్తుల అటాచ్
అక్టోబరులో 7.01 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం నవంబరు నాటికి 4.67 శాతానికి దిగి వచ్చినట్టు ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గతేడాది 81,973 మిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది అవి 84,835 మిలియన్ డాలర్లకు పెరిగినట్టు పేర్కొన్నారు. అలాగే, మనీలాండరింగ్ కేసులకు సంబంధించి క్రిప్టో ఏజెన్సీలకు చెందిన రూ. 907 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని, దీంతో సంబంధం ఉన్న ముగ్గురు అరెస్ట్ అయ్యారని తెలిపారు. అలాగే, బ్యాంకుల ప్రైవేటీకరణపైనా దృష్టి సారించినట్టు కేంద్రం తెలిపింది.