రాష్ట్రంలో ఎక్కడా డ్రగ్స్ వినియోగం ఉండకూడదు: సీఎం జగన్ ఆదేశాలు
- ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖలపై సీఎం జగన్ సమీక్ష
- రాష్ట్రాన్ని నార్కోటిక్స్ రహితంగా మార్చాలని నిర్దేశం
- పోలీసు, ఎక్సైజ్, ఎస్ఈబీ సమన్వయంతో పనిచేయాలని సూచన
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కాలేజీలు, యూనివర్సిటీల్లో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని, మాదకద్రవ్యాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్ఈబీ టోల్ ఫ్రీ నెంబరును బాగా ప్రచారం చేయాలని, ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఇక, దిశ యాప్ ను మరింతగా వినియోగంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు.