Kepler Planets: పెద్ద మొత్తంలో నీరు ఉన్న జంట గ్రహాలను గుర్తించిన హబుల్ టెలిస్కోప్

  • హబుల్ టెలిస్కోప్ తాజా ఆవిష్కరణ
  • 218 కాంతి సంవత్సరాల దూరంలో రెండు గ్రహాలు
  • సగం భాగం పైగా నీరు ఉన్నట్టు అంచనా
Hubble telescope found to exoplanets

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ రెండు కొత్త గ్రహాలను ఆవిష్కరించింది. నీటి జాడలున్న జంట గ్రహాలను ఈ స్పేస్ టెలిస్కోప్ గుర్తించింది. ఇవి ఓ నక్షత్ర మండలంలో భాగంగా ఉన్నాయని, ఈ రెండు గ్రహాలు భూమి పరిమాణం కంటే ఒకటిన్నర రెట్లు పెద్దవని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

ఇవి ఓ ఎర్రని మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నాయని తెలిపారు. లిరా నక్షత్ర మండలంలో 218 కాంతి సంవత్సరాల దూరంలో ఈ కొత్త గ్రహాలు ఉన్నట్టు తెలిపారు. ఈ రెండు గ్రహాలు నీటితో నిండి ఉన్నాయని పేర్కొన్నారు. వీటికి కెప్లెర్-138సి, కెప్లెర్-138డి అని నామకరణం చేశారు. ఈ రెండు గ్రహాల్లో అత్యధిక భాగం నీరు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

More Telugu News