డ్రగ్స్ కేసులో నోటీసులతో బీజేపీకి ఏంటి సంబంధం?: డీకే అరుణ
- డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు
- డ్రగ్స్ కేసు కొత్తదేమీ కాదన్న డీకే అరుణ
- తప్పుచేయకుంటే భయమెందుకని వ్యాఖ్యలు
తప్పుచేయకుంటే భయమెందుకు... అనవసరంగా ఏమీ నోటీసులు ఇవ్వరు కదా? అని ఆమె వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కేసులో నోటీసులు వస్తే, దాన్ని బీజేపీకి ముడివేయడం సరికాదని హితవు పలికారు. ఆ నోటీసులకు బీజేపీకి ఏంటి సంబంధం? అని ప్రశ్నించారు.
ఇక లిక్కర్ స్కాంపైనా డీకే అరుణ స్పందించారు. లిక్కర్ స్కాంలో కవిత పేరు బయటికి వచ్చాకే ఫాంహౌస్ కేసు వచ్చిందని అన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆణిముత్యాలైతే ప్రగతిభవన్ లో ఎందుకు బంధించారు? అని నిలదీశారు.