టీమిండియా దెబ్బకు బంగ్లాదేశ్ చిత్తు.. ఫాలో ఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా
- తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్
- టీమిండియాకు 254 పరుగుల భారీ ఆధిక్యత
- 5 వికెట్లను తీసిన కుల్దీప్ యాదవ్
బంగ్లా బ్యాటింగ్ లైనప్ ను స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, పేసర్ మొహమ్మద్ సిరాజ్ లు కకావికలం చేశారు. కుల్దీప్ యాదవ్ 40 పరుగులిచ్చి 5 వికెట్లను కూల్చగా, సిరాజ్ 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లను తీశాడు. ఉమేశ్ యాదవ్, అక్సర్ పటేల్ చెరో వికెట్ తీశారు.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 254 పరుగుల భారీ ఆధిక్యత లభించింది. బంగ్లాదేశ్ ను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికీ... రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించాలని టీమిండియా నిర్ణయించింది. భారత్ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించేందుకు ఓపెనర్లు కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్ మైదానంలోకి అడుగుపెట్టారు. తొలి ఓవర్ ను బంగ్లా బౌలర్ ఖలీద్ అహ్మద్ వేస్తున్నాడు.