ఇథనాల్ తోనూ నడిచే వ్యాగన్ ఆర్
- ఇంజన్, ఉపకరణాల్లో మార్పులు
- ఇథనాల్ కు అనుకూలంగా తయారీ
- ప్రస్తుతం పెట్రోల్ 10 శాతం ఇథనాల్
- 2025 నాటికి 20 శాతానికి పెరుగుదల
ఇథనాల్ కలిపిన ఇంథనం వినియోగించడం వల్ల ఇంజన్ పై ప్రభావం పడకుండా మన్నికగా ఉండేందుకు, ఫ్యూయల్ పంప్, ఫ్యూయల్ ఇంజెక్టర్, ఇతర ఉపకరణాలను కూడా ఇందులో మార్చింది. వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రొటోటైప్ ఈ85 ఇంధనంతో పనిచేస్తుందని, తద్వారా సీహెచ్ జీ ఉద్గారాల విడుదలను 79 శాతం తగ్గిస్తుందని మారుతి సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాషి టకెచి తెలిపారు.