Saitej: 'విరూపాక్ష'గా సాయితేజ్ .. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో గ్లింప్స్ రిలీజ్!

  • సాయితేజ్ 15వ సినిమాగా 'విరూపాక్ష'
  • స్క్రీన్ ప్లేను అందించిన సుకుమార్ 
  • హైలైట్ కానున్న అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
  • ఏప్రిల్ 21వ తేదీన ఐదు భాషల్లో విడుదల  
Virupaksha Movie Glimpse Released

ఆ మధ్య ప్రమాదానికి గురైన సాయితేజ్ కి కొంత గ్యాప్ వచ్చేసింది. ఆ తరువాత ఆయన చేస్తున్న సినిమానే 'విరూపాక్ష'. కెరియర్ పరంగా సాయితేజ్ కి ఇది 15వ సినిమా. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేసి కొంతసేపటి క్రితమే రివీల్ చేశారు.

టైటిల్ పోస్టర్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ ను వదలడం విశేషం. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రమే 'విరూపాక్ష' .. అంటూ టైటిల్ విషయంలో ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. టైటిల్ ను డిజైన్ చేయించిన తీరు కూడా ఆకట్టుకుంటోంది.

సుకుమార్ స్క్రీన్ ప్లేను అందించిన ఈ సినిమాకి ఆయన శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించిన ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో, వచ్చే ఏడాది ఏప్రిల్ 21వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News