Vivo X90: ప్రీమియం డిజైన్ తో వివో ఎక్స్90 విడుదల

Vivo X90 series launched with premium design and features
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ చైనా కంపెనీ వివో అత్యాధునిక, ప్రీమియం డిజైన్ తో కూడిన ఎక్స్90 స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. జీస్ ఆప్టిక్స్ సహా ఎన్నో ప్రత్యేకతలు ఈ ఫోన్లో కనిపిస్తాయి. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర 3,699 యువాన్లుగా ఉంది. మన రూపాయల్లో సుమారు రూ.42 వేలు. ఇక 8జీబీ ర్యామ్, 256 జీబీ ర్యామ్ మన రూపాయల ప్రకారం 57 వేలుగా ఉంది. వివో ఎక్స్90 ప్రో మోడల్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ ధర రూ.74 వేలుగా ఉంది.

ఈ మూడు ఫోన్లు కూడా ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ తో వస్తాయి. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పనిచేస్తాయి. పంచ్ హోల్ డిస్ ప్లే డిజైన్ తో ఇవి ఉన్నాయి. ఎక్స్ 90 మోడల్ 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, 300 హెర్జ్ శాంప్లింగ్ రేటు, మీడియా టెక్ డైమెన్సిటీ 9200 చిప్ సెట్, 4,810 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 866 కెమెరా సెన్సార్, ముందు భాగంలో 32 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాలుగా ఉంటాయి.

ఎక్స్ 90 ప్రో మోడల్ 6.78 అంగుళాల 2కే రిజల్యూషన్, అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు సహా ఎక్స్90లో ఉండే అన్ని ఫీచర్లు ఉంటాయి. అదనంగా 50 వాట్ వైర్ లెస్ చార్జింగ్ సదుపాయం ఉంటుంది. కెమెరా ఫీచర్లు కూడా దాదాపు సమానమే. వీటిని వివో భారత మార్కెట్లోకి ఎప్పుడు విడుదల చేస్తుందో చూడాలి. అత్యాధునిక ఫీచర్లు, అదిరిపోయే డిజైన్ తో ఉన్న వీటికి మన దేశంలోనూ మంచి డిమాండ్ కనిపించొచ్చు.
Go Back to Shorts
Vivo X90
launched
china market
premium design
features

More Telugu News