నరసాపురం సభలో జగన్ బ్రహ్మాండంగా నటించారు: బొండా ఉమ
- అసెంబ్లీని కూడా జగన్ బూతుల అడ్డాగా మార్చారన్న బొండా ఉమ
- నందిగం సురేశ్, గోరంట్ల మాధవ్ బాగోతాలు జగన్ కు తెలియవా? అని ప్రశ్న
- విజయసాయి ట్విట్టర్లో బూతులను వదులుతుంటే ఏం చేస్తున్నారని విమర్శ
కొడాలి నాని, రోజా, విజయసాయిరెడ్డి, తమ్మినేని సీతారాం, మల్లాది విష్ణు, ధర్మాన కృష్ణదాస్, అనిల్ కుమార్ యాదవ్, పార్థసారథి, ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడే బూతులు జగన్ కు వినిపించడం లేదా? అని బొండా ఉమ ప్రశ్నించారు. నందిగం సురేశ్, గోరంట్ల మాధవ్ బాగోతాలు జగన్ కు తెలియవా? అని అడిగారు. తాగి, గూండాలను వెనకేసుకుని, చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేశ్ కు జగన్ మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు. పచ్చి బూతులను విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా వదులుతుంటే జగన్ ఏం చేస్తున్నారని నిలదీశారు. జగన్ రెడ్డి ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకుంటే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు.