కర్మకాండలకూ ఓ స్టార్టప్.. అన్నీ వారే చేస్తారట!
- కర్మకాండల నుంచి మరణ ధ్రువీకరణ పత్రం వరకు సేవలు
- నెట్టింట వైరల్ అవుతున్న స్టార్టప్ మోడల్
- ఇలాంటి వాటి అవసరం ఏముందన్న ఐఏఎస్ అధికారి అవనీశ్ వైష్ణవ్
ఐఏఎస్ అధికారి అవనీశ్ వైష్ణవ్ ఈ స్టార్టప్ ఫొటోలను షేర్ చేస్తూ.. ఇలాంటి స్టార్టప్‌లతో అవసరం ఏముంది? అని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు కూడా బాగానే స్పందిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని పెద్దలు చెప్పేవారని, ఇప్పుడది నిజమైందని అంటున్నారు. మనకంటే ఇలాంటి సేవలు కొత్త కావొచ్చు కానీ అమెరికాలో మాత్రం మామూలేనని మరికొందరు కామెంట్ చేశారు. కాగా, కర్మకాండలు నిర్వహించేందుకు ఈ స్టార్టప్ రూ. 35 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తుందట!