కొడాలి నానికి కిడ్నీ ఆపరేషన్

Kodali Nani undergone Kidney operation
  • హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్
  • మూడు రోజుల క్రితమే ఆసుపత్రిలో చేరిన కొడాలి నాని
  • రెండు, మూడు రోజులో డిశ్చార్జ్ అయ్యే అవకాశం
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి కిడ్నీ ఆపరేషన్ జరిగింది. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో నిన్న రాత్రి డాక్టర్లు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నారు. కొంత కాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. మూడు రోజుల క్రితమే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రెండు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని కొడాలి నానికి వైద్యులు సూచించారు. ఆ తర్వాత ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అంతా బాగుందనుకుంటే 15 రోజుల తర్వాత కిడ్నీ సంబంధిత లేజర్ చికిత్సను వైద్యులు నిర్వహించనున్నారు.
Go Back to Shorts
Kodali Nani
YSRCP
Kidney
Operation

More Telugu News