హైకమాండ్ నుంచి పిలుపు.. ఢిల్లీకి వెళ్లిన ఈటల, కోమటిరెడ్డి
- అమిత్ షాతో భేటీ కానున్న ఈటల, కోమటిరెడ్డి
- ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న డీకే అరుణ
- తెలంగాణలో పార్టీ బలోపేతంపై మార్గనిర్దేశం చేయనున్న అమిత్ షా
ఈ నేపథ్యంలో తెలంగాణలో మరింత బలోపేతం కావడానికి వీరికి అమిత్ షా మార్గనిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే డీకే అరుణ ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు ఈ నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు బీజేపీ శిక్షణా తరగతులు జగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.