10 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపే యోచనలో అమెజాన్
- ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నమే!
- లాభదాయకత లేని విభాగాల ఉద్యోగులకు హెచ్చరిక
- కంపెనీలోనే ఇతర విభాగాలకు మారాలని సూచన
- కొంతకాలంగా నియామకాలను ఆపేసిన దిగ్గజ కంపెనీ
ఉద్యోగుల నియామకాలనూ కొంతకాలంగా ఆపేసింది. వేర్ హౌస్ ల నిర్మాణాన్ని వీలైనంత వరకు వాయిదా వేస్తూ వస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదంతా ఖర్చులు తగ్గించుకోవడానికేనని వివరించాయి. దీంతోపాటు పలు విభాగాలలోని సుమారు 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. సాధారణ పరిస్థితులలో ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ఏటా అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటుంది. దాదాపు 16 లక్షల మంది ఏటా అమెజాన్ లో చేరుతుంటారు. కాగా, కంపెనీ లాభాలు క్షీణించడంపై అమెజాన్ స్పందిస్తూ.. కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో పొదుపు చేయడంపై జనం ఎక్కువగా దృష్టి పెట్టారని, దాని ఫలితంగానే ఈసారి ఆశించినంతగా అమ్మకాలు నమోదు కాలేదని తెలిపింది.