మోదీని కలిసిన గవర్నర్, సీఎం జగన్.. కాసేపట్లో హెలికాప్టర్ లో సభాస్థలికి పయనం!
- ఉదయం 8 గంటలకు మోదీని కలిసిన గవర్నర్, సీఎం
- రూ. 10,742 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
- జన సంద్రంగా మారిన మద్దిలపాలెం జంక్షన్
మరోవైపు మోదీ సభను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపు 3 లక్షల మందిని తరలిస్తున్నారు. వీరి తరలింపు కోసం 4 వేల బస్సులు, పెద్ద సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. 8,500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీగా తరలివస్తున్న జనాలతో మద్దిలపాలెం జంక్షన్ జన సంద్రంగా మారింది.