ఇంగ్లండ్ తో సెమీస్.. సగం ఓవర్లలోపే ఓపెనర్లను కోల్పోయిన భారత్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా
- రెండో ఓవర్లోనే కేఎల్ రాహుల్ ఔట్
- ఇన్నింగ్స్ ను చక్కదిద్దిన రోహిత్, విరాట్
గత మ్యాచ్ ల్లో విఫలమైన కెప్టెన్ రోహిత్.. ఉన్నంతసేపు బ్యాట్ ఝుళిపించాడు. నాలుగు ఫోర్లతో అలరించాడు. 28 బంతుల్లో 27 పరుగులు చేసిన అతను క్రిస్ జోర్డాన్ వేసిన 9వ ఓవర్లో భారీ షాట్ కు ప్రయత్నించి సామ్ కరన్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దాంతో, రెండో వికెట్ కు 47 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. నిలకడగా ఆడుతున్న విరాట్ కోహ్లీకి ఫామ్ లో ఉన్న సూర్య కుమార్ తోడవగా.. సగం ఓవర్లకు భారత్ 62/2 స్కోరు తో నిలిచింది.