టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి ఆఫీసులో ఈడీ, ఐటీ సోదాలు
- నిన్న మంత్రి గంగుల ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు
- ఈ రోజు గాయత్రి రవి ఆఫీసులో కొనసాగుతున్న తనిఖీలు
- గ్రానైట్ వ్యాపారంలో అక్రమాల అభియోగాలతో దాడులు
మరోవైపు, ఈరోజు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి ఆఫీసులో అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న కార్యాలయంలో ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. గ్రానైట్ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ అందిన ఫిర్యాదుల మేరకు ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే కోణంలో దాడులు జరుగుతున్నాయి. మరోవైపు, ఈ దాడుల్లో కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.