హైస్కూల్ విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఏపీ మంత్రి ఉషశ్రీ... వీడియో ఇదిగో!
- అనంతపురం జిల్లాలో ఉషశ్రీ చరణ్ పర్యటన
- కల్యాణదుర్గంలో ఓ స్కూల్లో ఆకస్మిక తనిఖీ
- 6వ తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగిన వైనం
అంతేకాదు, 6వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. మంత్రి బోధన ఆంగ్ల మీడియంలో సాగింది. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి, వారి నుంచి సమాధానాలు రాబట్టారు. అనంతరం విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పి క్లాసు నుంచి నిష్క్రమించారు.
దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను మంత్రి ఉషశ్రీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకున్నారు.