Kalva Srinivasulu: చంద్రబాబుకు జగన్ ఎంతగా భయపడుతున్నాడో అర్థమవుతోంది: కాల్వ శ్రీనివాసులు
- చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణను వైసీపీ జీర్ణించుకోలేకపోతోందన్న కాల్వ శ్రీనివాసులు
- చంద్రబాబును దొంగదెబ్బ తీసేందుకు జగన్ యత్నిస్తున్నారని ఆరోపణ
- ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాలని హితవు
తమ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు వస్తున్న ప్రజాదరణను చూసి వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అందుకే చంద్రబాబును దొంగదెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి జగన్ యత్నిస్తున్నారని... ఇందులో భాగంగానే నందిగామలో కరెంట్ తీయించి రాళ్లు వేయించారని చెప్పారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడినే భయపెట్టాలనుకోవడం దారుణమని... ప్రజాస్వామ్యంలో ప్రమాదకర సంకేతమని అన్నారు.
తన పాలనలో శాంతిభద్రతల వైఫల్యాన్ని జగనే చాటుకుంటున్నారని చెప్పారు. కరెంటు తీయించి, రాళ్లు వేయించడాన్ని బట్టి చూస్తే చంద్రబాబుకు జగన్ ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఇలాంటి పిచ్చి పనులను మానుకోవాలని... లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.