హీరోగా 20 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటున్న ప్రభాస్ .. 'వర్షం' రీ రిలీజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోగా 20 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటున్న ప్రభాస్ .. 'వర్షం' రీ రిలీజ్!

Varsham movie re release on November 11th
  • 'ఈశ్వర్' సినిమాతో కెరియర్ మొదలు 
  • నవంబర్ 11 2002లో వచ్చిన 'ఈశ్వర్'
  • ఈ నెల 11వ తేదీతో హీరోగా 20 ఏళ్లు పూర్తి 
  • ఈ సందర్భంగా 'వర్షం' సినిమా రీ రిలీజ్
ప్రభాస్ .. ఇప్పుడు ఇది పేరు కాదు .. ఒక బ్రాండ్. ప్రభాస్ తో సినిమా చేయాలంటే వందల కోట్ల బడ్జెట్ .. వేలకోట్ల బిజినెస్ అన్నట్టుగా తయారైంది. 'ఈశ్వర్' సినిమాతో నవంబర్ 11 .. 2002లో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథను సెట్ చేసుకునే ఆయన రంగంలోకి దిగాడు. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ నెల 11వ తేదీకి 20 ఏళ్లు పూర్తవుతాయి. అంటే హీరోగా ప్రభాస్ తన ప్రయాణాన్ని మొదలెట్టి, 20 ఏళ్లు అవుతుందన్న మాట. 

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభాస్ అభిమానుల కోసం 'వర్షం' సినిమాను నవంబర్ 11వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ప్రభాస్ కెరియర్లో మూడవ సినిమాగా 'వర్షం' థియేటర్లకు వచ్చింది. ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ సినిమాకి సంతోష్ శోభన్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ కి తొలి బ్లాక్ బస్టర్ ను ఇచ్చింది ఈ సినిమాతోనే .. ప్రభాస్ కి స్టార్ హీరో ఇమేజ్ ను తెచ్చిపెట్టింది కూడా ఈ సినిమానే. 

కథాకథనాల పరంగానే కాదు .. పాటల పరంగా కూడా ఈ సినిమాను దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు. ఇప్పటికీ ఈ పాటలకు ఆదరణ తగ్గకపోవడం విశేషం. ప్రభాస్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో ఇది ఒకటి. అందువలన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రేమకథా చిత్రాల్లో కొత్త ట్రెండ్ ను సృష్టించిన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Prabhas
Trisha
Varsham Movie

More Telugu News