Telangana: మునుగోడులో గెలవబోతున్నాం: కేటీఆర్

kts says that trs wins th munugode bypoll
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవబోతోందని సదరు ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన పార్టీ శ్రేణులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల వల్లే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవబోతోందని ఆయన వివరించారు. 

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా తీవ్రంగానే శ్రమించారు. కేసీఆర్ 2 బహిరంగ సభల్లో పాలుపంచుకోగా..., కేసీఆర్ నియోజకవర్గంలోని పలు కీలక ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ఇక పార్టీ కీలక నేతలు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి తదితరులు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేశారు.
Go Back to Shorts
Telangana
TRS
KTR
Munugode

More Telugu News