అయ్యన్న అరెస్ట్ నేపథ్యంలో.. ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళనలు

TDP protests against Ayyanna Patrudu
  • అయ్యన్న, ఆయన కుమారుడిని అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు
  • నిరసన కార్యక్రమాలను చేపట్టిన టీడీపీ శ్రేణులు
  • అయ్యన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నర్సీపట్నంలోని ఆయన ఇంట్లో ఆయనతో పాటు ఆయన కుమారుడిని కూడా అరెస్ట్ చేసి తరలించారు. ఇంటిగోడ కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంలో ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు.

 మరోవైపు అయ్యన్నను అరెస్ట్ చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులను పాల్పడుతోందని నినాదాలు చేస్తున్నారు. అయ్యన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకు దిగిన టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ వారిని అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలిస్తున్నారు.
Go Back to Shorts
Ayyanna Patrudu
Telugudesam
Protests

More Telugu News