ఈ నెల 11న విశాఖకు వస్తున్న ప్రధాని మోదీ
- ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు
- మోదీకి స్వాగతం పలకనున్న గవర్నర్, సీఎం జగన్
- ఐఎన్ఎస్ చోళాలో బస చేయనున్న ప్రధాని
- ఈ నెల 12న పలు పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
తాజా పర్యటన సందర్భంగా, ప్రధానికి ఐఎన్ఎస్ డేగా వద్ద ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి మోదీ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరుకుంటారు. రాత్రికి ఐఎన్ఎస్ చోళాలో బస చేస్తారు. మరుసటి రోజు ఆంధ్రా యూనివర్సిటీ మైదానానికి చేరుకుని అక్కడి సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ దాదాపు 14 ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు మోదీ పర్యటన ఖరారైంది.