కుర్ర హీరోయిన్లతో సందడి చేస్తున్న రవితేజ!
- వరుస సినిమాలను లైన్లో పెట్టిన రవితేజ
- విడుదలకి రెడీ అవుతున్న 'ధమాకా'
- వచ్చే ఏడాదిలోను మూడు సినిమాల విడుదల
- కథానాయికలుగా యంగ్ బ్యూటీస్ సందడి
'నేల టిక్కెట్టు' సినిమా నుంచి రవితేజ యంగ్ బ్యూటీలతో జోడీకట్టడం ఎక్కువవుతూ వచ్చింది. ఆ సినిమాలో ఆయన సరసన మాళవిక శర్మ సందడి చేసింది. ఆ తరువాత 'డిస్కోరాజా' సినిమాలో నభా నటేశ్ .. 'ఖిలాడీ'లో మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి ఆయన సరసన ఆడిపాడారు. 'రామారావు ఆన్ డ్యూటీ'లో 'మజిలీ' ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ ఆయన జోడీ కట్టింది. ఇక త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ధమాకా' సినిమాలోనూ ఆయనతో కలిసి శ్రీలీల అలరించనుంది.
ఇక 'రావణాసుర' .. 'టైగర్ నాగేశ్వరరావు' లైన్లో ఉండగానే, రవితేజ మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేశారు. ఎడిటర్ గా .. సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరున్న కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమా పరమేశ్వరన్ .. కావ్య థాపర్ కనిపించనున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏదేమైనా రవితేజ జోరు ఎంతమాత్రం తగ్గకపోవడం విశేషమే.