పాదయాత్రలో చిన్నారులతో రాహుల్ గాంధీ పరుగు పందెం.. వెంట పరుగెత్తిన రేవంత్ రెడ్డి
- తెలంగాణలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
- ఐదో రోజులో భాగంగా ఈ ఉదయం జడ్చర్లలో యాత్ర ప్రారంభం
- చిన్నారులతో కలిసి కాసేపు రన్నింగ్ చేసిన రాహుల్ గాంధీ
రాహుల్ ఈ రోజు 22 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సాయంత్రం ఆయన షాద్‌నగర్‌లోని సోలిపూర్ జంక్షన్ వద్ద సభలో పాల్గొంటారు. నవంబర్ ఏడో తేదీ వరకు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 375 కి.మీ నడుస్తూ 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాలను రాహుల్ కవర్ చేయనున్నారు. నవంబర్ 4న యాత్రకు ఒకరోజు విరామం ఇస్తారు. రాష్ట్రంలో పాదయాత్ర జరిగే సమయంలో రాహుల్ గాంధీ క్రీడా, వ్యాపార, సినీ రంగాలకు చెందిన ప్రముఖులతో సహా మేధావులు, వివిధ సంఘాల నాయకులతో సమావేశమవుతారు. కాగా, భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది.