మోటార్లకు మీటర్లకు 95 శాతం మంది రైతులు సానుకూలం: మంత్రి పెద్దిరెడ్డి
- మోటార్లకు మీటర్లతో విద్యుత్ సరఫరాపై రైతులకు హక్కు వచ్చినట్టేనన్న పెద్దిరెడ్డి
- 2023 మార్చిలోగా మోటార్లకు మీటర్లు బిగిస్తామని వెల్లడి
- తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను కేంద్రమే ఇప్పించాలని డిమాండ్
ఈ సందర్భంగా ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపైనా పెద్దిరెడ్డి స్పందించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేశామని ఆయన అన్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలను వసూలు చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించామని చెప్పిన పెద్దిరెడ్డి... కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపడతామని తెలిపారు.