బాంబులు కాల్చొద్దన్న యువకుడు.. కత్తితో పొడిచి చంపిన మైనర్లు
- ముంబైలోని శివాజీ నగర్‌లో ఘటన
- గ్లాస్ బాటిల్‌లో టపాసులు ఉంచి పేలుస్తున్న బాలుడు
- బాటిల్ పగిలి ముక్కలు గుచ్చుకుంటాయని వారించిన యువకుడు
- సోదరుడు, అతడి స్నేహితుడితో కలిసి యువకుడిపై దాడికి దిగిన బాలుడు
- యువకుడిని కత్తితో పొడిచిన బాలుడి సోదరుడు
గొడవను చూసిన బాలుడి అన్న (15), అతడి స్నేహితుడు (14) అక్కడికొచ్చారు. ముగ్గురూ కలిసి శంకర్‌తో గొడవకు దిగారు. అనంతరం ఆగ్రహంతో అతడిపై దాడిచేశారు. బాలుడి అన్న కత్తితో శంకర్ పొట్టలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన శంకర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి అన్న, అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు. ఘటనకు కారణమైన బాలుడు పరారీలో ఉన్నాడు.