ఇది మేము సాధించిన గొప్ప విజయం: కేజ్రీవాల్
- గుజరాత్ లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మోదీ
- ఢిల్లీ స్కూళ్లను ఐదేళ్లలో తాము అద్భుతంగా తీర్చిదిద్దామన్న కేజ్రీవాల్
- తమ అనుభవాన్ని వినియోగించుకోవాలని ప్రధానికి సూచించిన వైనం
మోదీని ఉద్దేశించి ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... 'పీఎం సర్.. పాఠశాలలు, విద్యకు సంబంధించి ఢిల్లీలో మేము మంచి కార్యక్రమాలు చేశాం. గత ఐదేళ్ల కాలంలో ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దాం. మన దేశంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ ఐదేళ్లలో అభివృద్ధి చెందుతాయి. పాఠశాలలను ఎలా ఆధునికీకరించాలనే విషయంలో మాకు పూర్తి అనుభవం ఉంది. స్కూళ్లను అభివృద్ధి చేసే విషయంలో మమ్మల్ని పూర్తిగా వినియోగించుకోండి. దేశం కోసం కలిసి ఈ పని చేద్దాం' అని అన్నారు.
మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ పాఠశాలలు, విద్య అంశాల్లో రాజకీయాలు చొరబడకపోడం సంతోషించదగ్గ విషయం అని కేజ్రీవాల్ చెప్పారు. అయితే, ఎన్నికల సమయంలోనే విద్య అనేది మనకు గుర్తుకు రాకూడదని అన్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేస్తే కేవలం ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చని తెలిపారు.