విశాఖ గర్జన విజయవంతం కావడంతో చంద్రబాబు, పవన్ తట్టుకోలేకపోతున్నారు: మంత్రి పెద్దిరెడ్డి
- విశాఖలో అక్టోబరు 15న వైసీపీ గర్జన
- గర్జన సక్సెస్ అయిందని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి
- చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతోందని వ్యాఖ్యలు
- బాబు డైరెక్షన్ లో పవన్ నడుస్తున్నాడని విమర్శలు
అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన వ్యక్తి చంద్రబాబు అని, చంద్రబాబు పాలనలో పోలీసులను హీనంగా చూశారని పెద్దిరెడ్డి తెలిపారు. ఇప్పుడు సీఎం జగన్ పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరాచకపాలన గురించి అందరికీ తెలుసని అన్నారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు అన్ని ప్రాంతాల ప్రజలు మద్దతు పలుకుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.