Janasena: సాయంత్రం 4 గంటల్లోగా విశాఖను వీడాలి... పవన్ కు ఏపీ పోలీసుల నోటీసులు

ap police notices to pawan kalyan to leave vizag
షార్ట్స్‌లో చూడండి
విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో విశాఖ పోలీసులు పవన్ కల్యాణ్ తో పాటు జనసేన కీలక నేతలకు సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటల్లోగా విశాఖను వీడాలని సదరు నోటీసుల్లో పవన్ తో పాటు జనసేన నేతలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. 

ఈ నోటీసులను తీసుకునే విషయంలో జనసేన నేతలు, విశాఖ పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. నోటీసులు తీసుకునేందుకు జనసేన నేతలు నిరాకరించడంతో పోలీసులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లిన పోలీసులు ఆయనతో చర్చలు జరిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే నోటీసులు జారీ చేస్తున్నామని ఆయనకు నచ్చజెప్పారు. ఈ నోటీసులపై పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకోలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
Go Back to Shorts
Janasena
Pawan Kalyan
Vizag
AP Police

More Telugu News