విశాఖకు పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుంది: మంత్రి బొత్స
- విశాఖకు రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రజల్లో బలమైన కాంక్ష ఉందన్న బొత్స
- విశాఖ గర్జనలో ఆ విషయం తేటతెల్లమైందని వెల్లడి
- జనసేనను ఓ వ్యక్తి పెట్టుకున్న సంస్థగా అభివర్ణన
- టీడీపీ, జనసేనలకు విశాఖపై అంత కక్ష ఎందుకని నిలదీత
ఈ సందర్భంగా జనసేన, టీడీపీలపై బొత్స విమర్శలు గుప్పించారు. విశాఖకు పరిపాలనా రాజధాని వస్తుంటే... టీడీపీ, జనసేన అడ్డుకుంటున్నాయని బొత్స ఆరోపించారు. 3 రాజధానుల అంశంపై ఆ రెండు పార్టీలకు ఉన్న అభ్యంతరం ఏమిటని బొత్స ప్రశ్నించారు. విశాఖకు పరిపాలనా రాజధాని రాకుండా ఆ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. విశాఖకు వ్యతిరేకంగా ఆ రెండు పార్టీలు ఆడే ఆటలు ఇకపై చెల్లబోవని కూడా బొత్స అన్నారు. జనసేన అసలు ఓ రాజకీయ పార్టీనే కాదన్న బొత్స... ఓ వ్యక్తి పెట్టుకున్న సంస్థగా అభివర్ణించారు. జనసేనతో పాటు టీడీపీకి విశాఖపై అంత కక్ష ఎందుకని బొత్స ప్రశ్నించారు.