ప్రొఫెసర్ సాయిబాబా కేసుపై రేపు సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ
- సాయిబాబాతో పాటు ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించిన బాంబే హైకోర్టు
- నిందితులను విడుదల చేయాలంటూ ఉత్తర్వుల జారీ
- బాంబే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఎన్ఐఏ
- సాయిబాబా విడుదలను నిలుపుదల చేయాలన్న అభ్యర్థనకు సుప్రీం నిరాకరణ
- ఎన్ఐఏ పిటిషన్‌పై శనివారం విచారణ చేపట్టేందుకు అంగీకారం
అయితే సీజేఐ జస్టిస్ లలిత్‌తో చర్చలు జరిపిన తర్వాత జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రొఫెసర్ సాయిబాబా విడుదలను నిలుపుదల చేయడం కుదరదని చెప్పిన ధర్మాసనం... ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరమైనదిగా భావిస్తూ శనివారం ఉదయం 11 గంటలపై విచారిస్తామని పేర్కొంది. ఈ పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా త్రివేదీలతో కూడిన బెంచ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. బాంబే హైకోర్టు తీర్పును ఎన్ఐఏ సవాల్ చేయడం, దానిపై సుప్రీంకోర్టు అత్యవసర విచారణకు అంగీకరించడం ప్రాదాన్యం సంతరించుకుంది.