Nagachaitanya: ద్విభాషా చిత్రం కోసం రంగంలోకి స్టార్స్!

Priyamani in Chaitu Movie
షార్ట్స్‌లో చూడండి
నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. దర్శకుడిగా వెంకట్ ప్రభుకి ఇది 11వ సినిమా కాగా, కెరియర్ పరంగా ఇది చైతూకి 22వ సినిమా. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం ఎంపికైన స్టార్స్ ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకిగాను ప్రియమణిని తీసుకున్నారు. మరో కీలకమైన పాత్ర కోసం సంపత్ రాజ్ ను తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్స్ ను వదిలారు. ఈ సినిమా షూటింగులో వారు జాయిన్ అవుతున్నారు.

చైతూ - కృతి శెట్టి 'బంగార్రాజు' హిట్ తరువాత కలిసి చేస్తున్న సినిమా ఇది. 'బంగార్రాజు' తరువాత వాళ్లు చేసిన వేరు వేరు సినిమాలు ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాయి. అందువలన ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలని వాళ్లు భావిస్తున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదలవుతోంది.
Go Back to Shorts
Nagachaitanya
Krithi Shetty
Venkat Prabhu Movie

More Telugu News