రేవంత్ రెడ్డి సహా టీ కాంగ్రెస్ నేతలకు క్లాస్ తీసుకున్న కేసీ వేణుగోపాల్
- త్వరలోనే తెలంగాణలోకి ప్రవేశించనున్న రాహుల్ యాత్ర
- యాత్ర ఏర్పాట్లపై సమీక్ష కోసం హైదరాబాద్ వచ్చిన వేణుగోపాల్
- జోడో యాత్రపై తెలంగాణలో ప్రచారమే జరగడం లేదని అసంతృప్తి
- పబ్లిసిటీలో ముందుండే రేవంత్... జోడో పబ్లిసిటీలో వెనుకబడ్డారని వ్యాఖ్య
- యాత్రపై మాట్లాడమంటే తనను పొగడుతారేమిటని వంశీపై అసహనం
భారత్ జోడో యాత్ర పట్ల తెలంగాణలో పెద్దగా ప్రచారమే జరగడం లేదని వేణుగోపాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పబ్లిసిటీలో అందరికంటే ముందు ఉండే రేవంత్ రెడ్డి... జోడో యాత్ర పబ్లిసిటీలో మాత్రం ఎందుకు వెనుకబడ్డారంటూ నేరుగా రేవంత్‌నే ఆయన ప్రశ్నించారు. ఇకనైనా జోడో యాత్ర ప్రచారాన్ని పెంచాలని ఆయన రేవంత్‌కు సూచించారు. ఈ సందర్భంగా కలగజేసుకున్న మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి... యాత్రలో సత్తా చాటుతున్నారంటూ వేణుగోపాల్‌పై ప్రశంసలు కురిపించారు. వంశీచంద్ రెడ్డి వ్యాఖ్యలకు అడ్డు తగిలిన వేణుగోపాల్...యాత్ర గురించి మాట్లాడమంటే తనను పొగుడుతారేమిటని అసహనం వ్యక్తం చేశారు.