తప్పతాగి డ్రైవింగ్... బుక్కరాయసముద్రం వద్ద వాగులో పడిపోయిన లారీ.... వీడియో ఇదిగో

Lorry slips into flood water at Bukkarayasamudram
  • అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు
  • పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  • మద్యం మత్తులో లారీపై నియంత్రణ కోల్పోయిన డ్రైవర్
  • డ్రైవర్ సురక్షితం
అనంతపురం జిల్లాలో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని అనేక ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకుపోయాయి. బుక్కరాయసముద్రం వద్ద వాగు కూడా వరద నీటితో ఉప్పొంగుతోంది. 

ఈ నేపథ్యంలో, వాగుపై ఉన్న చప్టా మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. అటుగా వచ్చిన ఓ కాంక్రీటు మిక్సర్ లారీ చప్టా మీద నుంచి జారిపోయి నీటిలో పడిపోయింది. అయితే క్యాబిన్ స్థిరంగా నిలబడడంతో డ్రైవర్ కు ప్రాణాపాయం తప్పింది. అతడిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. 

కాగా, ఆ డ్రైవర్ తప్పతాగి డ్రైవింగ్ చేసినందువల్లే లారీ వాగులో పడిపోయినట్టు గుర్తించారు. ఆ డ్రైవర్ కు బ్రీత్ ఎనలైజర్ టెస్టు నిర్వహించగా, 183 పాయింట్లు చూపించింది. మద్యం మత్తులో నడపడం వల్లే లారీని నియంత్రించలేకపోయాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
Go Back to Shorts
Lorry
Bukkarayasamudram
Flood
Rains
Anantapur District

More Telugu News