Chiranjeevi: అక్షరాలా మెగాస్టార్ చెప్పినట్టే జరిగింది: సత్యదేవ్

  • ఈ నెల 5వ తేదీన విడుదలైన 'గాడ్ ఫాదర్'
  • విడుదలైన ప్రతి ప్రాంతంలో భారీ వసూళ్లు 
  • జయదేవ్ పాత్రను పోషించిన సత్యదేవ్ కి మంచి గుర్తింపు 
  • చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పిన సత్యదేవ్ 
God Father movie Press Meet

చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'గాడ్ ఫాదర్' ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యదేవ్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ఈ పాత్ర కోసం ఆయన పేరును సూచించినది చిరంజీవి అనే విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందంటూ తాజాగా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. 

ఈ వేదికపై సత్యదేవ్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో జయదేవ్ పాత్ర కోసం చిరంజీవి గారు నన్ను సిఫార్స్ చేశారు. ఈ పాత్రకి నేను న్యాయం చేస్తానని ఆయన భావించారు. ఈ సినిమాను చూసిన వాళ్లంతా నేను బాగా చేశానని అభినందిస్తూ ఉంటే, అన్నయ్య నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నాను. 

ఈ సినిమాలో జయదేవ్ పాత్ర చేయడం వలన నాకు మరింత గుర్తింపు వస్తుందనీ, నా నటన గురించి నలుగురూ మాట్లాడుకుంటారని షూటింగుకి ముందే అన్నయ్య నాకు చెప్పారు. అప్పుడు ఆయన ఏదైతే చెప్పారో ఈ రోజున అదే జరిగింది. ఇంతమంచి పాత్రను చేసే అవకాశం ఇచ్చిన చిరంజీవిగారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను" అంటూ చెప్పుకొచ్చాడు. 

More Telugu News