ఏపీ ఆలయాల్లో టికెట్ల రేట్లు పెంచేది లేదు: మంత్రి కొట్టు
- దీనిపై ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టలేదని వెల్లడి
- కాణిపాకం ఆలయంలో అభిషేకం టికెట్ రేటు వివాదంపై మంత్రి స్పందన
- ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న అధికారిపై చర్యలు తీసుకున్నామన్న మంత్రి
కాణిపాకం ఆలయంలో సదరు అధికారి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో చర్యలు తీసుకున్నామని చెప్పారు. అలాగే, దేవాలయాల్లో టికెట్ల ధరల పెంపుపై ఎలాంటి ప్రజాభిప్రాయసేకరణ చేయడంలేదని సత్యనారాయణ తెలిపారు రూ.కోటి ఆదాయం ఉన్న ఆలయాల పాలక మండలి నియామకాలు ధార్మిక పరిషత్ ద్వారా మాత్రమే చేపట్టాలని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఇక, దుర్గగుడిలో అంతరాలయం దర్శనం కోసమే రూ.500 టికెట్ ఇస్తారన్నారు. అంతరాలయం, ప్రొటోకాల్ దర్శనాలను నియంత్రించడం కోసమే ఆ ఏర్పాటు చేశామన్నారు. గత ఏడాది నుంచే ఈ టికెట్ అమల్లో ఉందని తెలిపారు. ఇక, జగ్గయ్యపేటలోని బ్రహ్మనంద మఠంపై సమగ్ర వివరాలతో నివేదిక రూపొందించి ధార్మిక పరిషత్‌కు అందజేసేందుకు ఒక ఉప కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.