ఎలాంటి ప్రయాణాలు వద్దు!.. ఉక్రెయిన్‌లోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ సూచన!
- ఉక్రెయిన్ అధ్యక్ష భవనంపై దాడి చేసిన రష్యా
- ఫలితంగా అక్కడి తన పౌరుల భద్రతపై భారత్ ఆందోళన
- కీవ్‌లోని ఎంబసీతో టచ్‌లో ఉండాలంటూ సూచనలు
ప్రస్తుతం తమ పరిస్థితి ఏమిటన్న విషయాన్ని ఎంబసీకి తెలియజేయాలని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తున్నా... గడచిన కొంతకాలంగా అక్కడ పెద్దగా ఉద్రిక్తతలు కనిపించలేదు. అయితే సోమవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా అనేక నగరాలను లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణులు ప్రయోగించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా అప్రమత్తమైన భారత్... అక్కడి తన పౌరులకు జాగ్రత్తలు చెబుతూ అడ్వైజరీ విడుదల చేసింది.