హీరో ప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
- 'ఆదిపురుష్'లో రాముడిగా నటిస్తున్న ప్రభాస్
- 'ఆదిపురుష్' పై వివాదాలు
- హిందువుల మనోభావాలను దెబ్బ తీశారంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
- సినిమా విడుదలపై స్టే విధించాలని అభ్యర్థన
- 'ఆదిపురుష్' చిత్ర యూనిట్‌కూ కోర్టు నోటీసులు
ఈ క్రమంలో 'ఆదిపురుష్' సినిమాలో హిందువుల మనోభావాలను గాయపరిచారంటూ ఓ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 'ఆదిపురుష్' సినిమా విడుదలపై స్టే విధించాలని కూడా సదరు సంస్థ కోర్టును కోరింది.
ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు హీరో ప్రభాస్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రభాస్‌తో పాటు 'ఆదిపురుష్' చిత్ర యూనిట్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.