Allu Arjun: బన్నీతో త్రివిక్రమ్ సినిమాపై వినిపిస్తున్న టాక్ ఇదే!

Allu Arjun in Trivikram Movie
షార్ట్స్‌లో చూడండి
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నీ ఒకదానికిమించి మరొకటి విజయాన్ని సాధించాయి. 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' .. 'అల వైకుంఠపురములో' సినిమాలు వసూళ్ల వర్షాన్ని కురిపించాయి. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. 

ఇటీవలే బన్నీకి త్రివిక్రమ్ కథను వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని చెబుతున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబుతో త్రివిక్రమ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన చేసే ప్రాజెక్టు బన్నీతోనే ఉంటుందని చెబుతున్నారు. ఈ లోగా బన్నీ 'పుష్ప 2' సినిమాను పూర్తిచేయడం జరుగుతుందని అంటున్నారు. 

ఇక ఈ ప్రాజెక్టుతో పాటు బోయపాటి .. అట్లీ కుమార్ సినిమాలను బన్నీ లైన్లో పెట్టేశాడు. మొత్తానికి అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్లనే లైన్లో పెట్టేశాడు. 'పుష్ప 2'తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను కొనసాగించడానికి ఆయన తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. చూడాలి త్రివిక్రమ్ - బన్నీ కలిసి మరో హిట్ కొడతారేమో. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Go Back to Shorts
Allu Arjun
Trivikram Srinivas
Tollywood

More Telugu News