ఏడు ఖండాలు కాదు.. అన్నీ కలిసి ఒక్క ‘అమేషియా’ అవుతుంది.. భవిష్యత్తుపై శాస్త్రవేత్తల అంచనాలివీ..

Earths supercontinent Amasia after 300 million years
  • భూమి టెక్టానిక్ ప్లేట్ల కదలికల ఆధారంగా న్యూకర్టిన్ యూనివర్సిటీ పరిశోధన
  • అమెరికా ఖండాలు దగ్గరగా వచ్చి ఆసియాకు కలుస్తాయని.. మధ్యలో ఆస్ట్రేలియా చేరుతుందని అంచనా
  • పసిఫిక్ మహా సముద్రం మూసుకుపోతుందని ప్రతిపాదన
  • ఇదంతా జరగడానికి సుమారు 20, 30 కోట్ల ఏళ్లు పడుతుందని వెల్లడి
భూమ్మీద ఖండాలు ఎన్ని, వాటి పేర్లు ఏమిటి.. అనేది నాలుగు, ఐదో తరగతుల్లోనే మనకు నేర్పించేస్తుంటారు. అంటార్కిటికా తప్ప భూమ్మీద అన్ని ఖండాలపైనా మనుషులు ఉన్నారని చెప్తుంటారు. ఇప్పటికైతే ఇది నిజమేకాగా.. భవిష్యత్తులో మాత్రం కాదట. భూమ్మీద ఏడు  ఖండాలు ఉండబోవనీ అన్నీ కలిసి ఒకే ఖండంగా మారిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద భూభాగాలన్నీ ఒకప్పుడు పాంజియా పేరుతో ఒకే ఖండంగా ఉండేవని భవిష్యత్తులో మళ్లీ ‘అమేషియా’గా ఒకే ఖండంగా మారుతాయని అంటున్నారు.

టెక్టానిక్ ప్లేట్ల కదలికల ఆధారంగా..
ఆస్ట్రేలియాకు చెందిన న్యూ కర్టిన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు చేశారు. సాధారణంగా భూమి ఉపరితల పొరలోని టెక్టానిక్ ప్లేట్లు తరచూ కదులుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఖండాలు, ఇతర భూభాగాలు ఉండే చోటు, వాటి ఆకారం ఉంటాయి. భవిష్యత్తులోనూ ఇది కొనసాగే క్రమంలో శాస్త్రవేత్తలు ఒక సూపర్ కంప్యూటర్ సాయంతో పరిస్థితిని పరిశీలించారు.

అన్నీ కలసి ‘అమేషియా’గా..
  • భూమి ఏర్పడి 200 కోట్ల ఏళ్లకుపైనే అవుతోంది. నాటి నుంచీ భూమ్మీద ఉపరితలం పొర కదులుతూనే ఉంది. అయితే అది ఒకేభాగంలా కాకుండా.. భూమి అంతర్భాగంలోని లావా సముద్రంపై తేలియాడుతున్న ప్లేట్ల తరహాలో ఉంటుంది. వీటినే టెక్టానిక్ ప్లేట్లు అంటాం.
  • భూమి పరిభ్రమణం, భ్రమణం ఆధారంగా ప్రతి 50, 60 కోట్ల ఏళ్లకోసారి ఈ కదలికలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త ఖండాలు ఏర్పడటం, ఉన్నవి విడిపోవడం వంటివి జరుగుతాయని అంటున్నారు.
  • ఈ లెక్కన మరో 20 కోట్ల ఏళ్లలో పసిఫిక్‌ మహా సముద్రం మూసుకుపోతుందని.. ఖండాలన్నీ కలిసి ఒకే అతి పెద్ద ఖండం ఏర్పడుతుందని చెబుతున్నారు.
  • భవిష్యత్తులో ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు ఆసియాకు దగ్గరగా వచ్చి కలిసిపోతాయని, ఇప్పటికే దగ్గరగా ఉన్న ఆఫ్రికా, ఆస్ట్రేలియా కూడా జత కలుస్తాయని.. మొత్తంగా భారీ ఖండం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
  • ఈ క్రమంలోనే అమెరికా, ఆసియా పేర్లు కలిసేలా ‘అమేషియా’ అని కొత్త ఖండానికి పేరు పెట్టినట్టు తెలిపారు.
Go Back to Shorts
Earth
Amasia
America
Asia
Super continent
Offbeat
Science

More Telugu News