పాత ఫోన్ ఎక్సేంజ్ పై రూ.23 వేలకు ఐఫోన్ 12
- డిస్కౌంట్ తర్వాత 64 జీబీ ధర రూ.47,999
- పాత ఫోన్ ఎక్సేంజ్ పై రూ.25,000 వరకు తగ్గింపు
- ఫోన్ మోడల్, కండీషన్ ఆధారంగా ఎక్సేంజ్ విలువలో మార్పులు
అమెజాన్ ఎక్స్ ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి మొదలు కానుంది. ఈ సమయంలో ఐఫోన్ 12, 64 జీబీ స్టోరేజీ వేరియంట్ ను చౌకగా పొందే అవకాశం లభించనుంది. దీని ఎంఆర్ పీ రూ.65,900 కాగా, దీనిపై 27 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో రూ.47,999 కు లభిస్తోంది. అంతేకాదు, పాత ఫోన్ (మంచి కండీషన్)ను ఎక్సేంజ్ చేస్తే గరిష్టంగా రూ.25 వేలకు ఇస్తోంది. దీంతో ఐఫోన్ 12 రూ.22,999కే రానుంది. ఐఫోన్ 128జీబీ మోడల్ ను అమెజాన్ రూ.54,990కు ఆఫర్ చేస్తోంది.
2020లో విడుదలైన ఈ మోడల్ 6.1 అంగుళాల ఐఫోన్ 128జీబీ మోడల్ ను అమెజాన్ రూ.54,990కు ఆఫర్ చేస్తోంది. 2020లో విడుదలైన ఈ మోడల్ 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ టీఆర్ ఎక్స్ డీఆర్ డిస్ ప్లే, సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్, యాపిల్ ఏ14 బయోనిక్ చిప్ సెట్ తో పనిచేస్తుంది.