Vishhwaksen: నీ లైఫ్ ను నువ్వు మార్చుకునేందుకు నేను నీకు ఇచ్చే సెకండ్ ఛాన్స్ ఈ టికెట్: 'ఓరి దేవుడా' ట్రైలర్ రిలీజ్

  • విష్వక్సేన్ హీరోగా 'ఓరి దేవుడా'
  • కథానాయికగా మిథిల పరిచయం 
  • ప్రత్యేకమైన పాత్రలో వెంకటేశ్ 
  • ఈ నెల 21వ తేదీన సినిమా విడుదల  
Ori Devuda Trailer Released

విష్వక్సేన్ హీరోగా 'ఓరి దేవుడా' సినిమా రూపొందింది. లవ్ అండ్ ఎమోషన్ ను టచ్ చేస్తూ సాగె కామెడీ ఎంటర్టైనర్ గా ఈ కథ కనిపిస్తోంది. పీవీపీ సినిమా వారు ఈ సినిమాను నిర్మించగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. విష్వక్సేన్ జోడీగా మిథిల తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. ఈ సినిమాలో వెంకటేశ్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుండటం విశేషం. 

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రేమ .. అలకలు .. గొడవలు .. ఎమోషన్ .. కామెడీకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. వెంకటేశ్ పాత్రను హైలైట్ చేస్తూనే ఈ ట్రైలర్ ను వదిలారు. దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని,  ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు. 

ఈ సినిమాలో కూడా పూరి గెస్టు రోల్ లో కనిపించనున్నాడని అర్థమవుతోంది. మురళీశర్మ .. నాగినీడు ... రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 'అశోక వనంలో అర్జున కల్యాణం' తరువాత విష్వక్సేన్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి. 

More Telugu News