రావణుడి దహనంలో.. సీన్ రివర్స్ అయింది
- ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఘటన
- రావణుడి నుంచి దూసుకొచ్చిన రాకెట్లు
- పరుగులు పెట్టిన జనాలు
రావణాసురుడి నుంచి దూసుకొచ్చిన రాకెట్లు జనాలపైకి ఎగసిపడ్డాయి. దీంతో జనాలు భయంతో పరుగులు పెట్టారు. భద్రత కోసం అక్కడకు వచ్చిన పోలీసులు సైతం పరుగెత్తారు. ఇదంతా సర్దుకున్న తర్వాత ఓ దున్నపోతు కూడా జనంలోకి దూసుకొచ్చి హంగామా చేసింది.