కేసీఆర్ కు తెలంగాణతో సంబంధం తెగిపోయింది: ఈటల రాజేందర్
- ఉద్యమ పార్టీని కేసీఆర్ ఖతం చేశారు
- ఉద్యమకారులను కూడా మర్చిపోయేలా కొత్త పార్టీని స్థాపించారు
- అక్రమ సంపాదనతో దేశ రాజకీయాలను నడపాలనుకుంటున్నారు
తెలంగాణ సాధన కోసం వచ్చిన ఉద్యమ పార్టీని కేసీఆర్ ఖతం చేశారని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన ఉద్యమకారులను కూడా మర్చిపోయేలా, పూర్తిగా కేసీఆర్ ముద్ర మాత్రమే ఉండేలా పార్టీని స్థాపించారని విమర్శించారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయాలను నడపాలని పగటి కలలు కంటున్నారని దుయ్యబట్టారు. కూట్లో రాయి తీయలేనోడు... ఏట్లో రాయి తీయడానికి పోయినట్టుందని అన్నారు.