శ్రీరాముడికి హనుమంతుడిలా... రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి: సుబ్బరామిరెడ్డి
- రాహుల్ యాత్రపై టీపీసీసీ కీలక భేటీ
- గాంధీ భవన్‌లో జరిగిన భేటీకి హాజరైన సుబ్బరామిరెడ్డి
- రేవంత్ రెడ్డి చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకమని వ్యాఖ్య
- తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం
రాహుల్ గాంధీకి కుడి భుజంలా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని సుబ్బరామిరెడ్డి అన్నారు. శ్రీరాముడికి హనుమంతుడు ఎలాగో... రాహల్ గాంధీకి రేవంత్ రెడ్డి కూడా అంతేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని సుబ్బరామిరెడ్ది... రేవంత్ రెడ్డి చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకమని కూడా అన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన అన్నారు.