కాపలా కుక్కలా ఉంటానన్నాడు.. కాటేసే నక్కలా మారిపోయాడు: మధు యాష్కీ
- లిక్కర్ స్కామ్ ను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ అంటున్నారు
- కవిత ఎత్తుకునే బతుకమ్మ లోపల కూడా లిక్కర్ బాటిల్ ఉంటుంది
- ఏపీలో వెలమలను కేసీఆర్ సంప్రదిస్తున్నారు
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ మూతి పగులగొట్టారని మధు యాష్కీ అన్నారు. లిక్కర్ కుంభకోణాన్ని కప్పి పుచ్చుకునేందుకే జాతీయ పార్టీ అంటున్నారని విమర్శించారు. కవిత ఎత్తుకునే బతుకమ్మ లోపల కూడా లిక్కర్ బాటిల్ ఉంటుందని అన్నారు. ఏపీలో ఉన్న కొందరు వెలమ కులస్తులను కేసీఆర్ సంప్రదిస్తున్నారని.. తన కుల సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికే ఈ ప్రయత్నాలని దుయ్యబట్టారు. గతంలో ఏపీని తిట్టిన కేసీఆర్... ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఏపీకి వెళ్తారని ప్రశ్నించారు.