గుజరాత్ లో ఆప్ దే గెలుపని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెపుతోంది: కేజ్రీవాల్
- తక్కువ మార్జిన్ తో గుజరాత్ లో ఆప్ ప్రభుత్వం వస్తుందన్న కేజ్రీ
- గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయని ఐబీ రిపోర్ట్ లో ఉందని వ్యాఖ్య
- ఆప్ ఓట్లు చీల్చే బాధ్యతను కాంగ్రెస్ కు అప్పగించారని వ్యాఖ్య
గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయని, ఈ పార్టీల నేతలు రహస్యంగా సమావేశమవుతున్నారని ఐబీ రిపోర్ట్ లో ఉందని కేజ్రీవాల్ తెలిపారు. గుజరాత్ లో బీజేపీ పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని... బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని బీజేపీ బలోపేతం చేస్తోందని చెప్పారు. ఆప్ కు పడే ఓట్లలో వీలైనంత వరకు చీల్చే బాధ్యతను కాంగ్రెస్ కు అప్పగించారని అన్నారు. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని గుజరాత్ ప్రజలను కోరుతున్నానని చెప్పారు.