Tollywood: స్వ‌ర్ణ దేవాల‌యంలో కుటుంబ స‌మేతంగా అల్లు అర్జున్‌

allu arjun visits golden temple in amritsar with his family
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్ గురువారం మ‌ధ్యాహ్నం అమృత్‌స‌ర్‌లోని స్వ‌ర్ణ దేవాల‌యంలో క‌నిపించారు. భార్యాపిల్ల‌ల‌తో క‌లిసి ఆయ‌న స్వ‌ర్ణ దేవాల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న కుటుంబంతో క‌లిసి ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో పాలుపంచుకున్నారు. స్వ‌ర్ణ దేవాల‌యంలో అల్లు అర్జున్ ఫ్యామిలీతో క‌లిసి క‌నిపించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పుష్ప‌-2 చిత్రం షూటింగ్‌లో బిజీబిజీగా గ‌డుపుతున్న అల్లు అర్జున్ కాస్తంత వీలు చూసుకుని ఫ్యామిలీతో క‌లిసి అమృత్ స‌ర్ వెళ్లిన‌ట్లు స‌మాచారం.
Go Back to Shorts
Tollywood
Allu Arjun
Amritsar
Golden Temple

More Telugu News