కృష్ణ, మహేశ్ బాబులను వ్యక్తిగతంగా కలిసి పరామర్శించిన చిరంజీవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కృష్ణ, మహేశ్ బాబులను వ్యక్తిగతంగా కలిసి పరామర్శించిన చిరంజీవి

Chiranjeevi consoles Krishna and Mahesh Babu
  • నిన్న ఇందిరా దేవి కన్నుమూత
  • అదే రోజున గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
  • అనంతపురం వెళ్లిన చిరంజీవి
  • ఈ ఉదయం ఇందిరా దేవి చిత్రపటానికి నివాళి
మెగాస్టార్ చిరంజీవి నిన్న గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో బిజీగా ఉన్నారు. దాంతో సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి కన్నుమూయగా, ఆమె అంత్యక్రియలకు చిరంజీవి హాజరుకాలేకపోయారు. 

ఈ నేపథ్యంలో, ఇవాళ కృష్ణ, మహేశ్ బాబులను చిరంజీవి వ్యక్తిగతంగా కలిశారు. విషాదంలో ఉన్న వారిద్దరినీ పరామర్శించారు. ఈ ఉదయం ఘట్టమనేని వారి ఇంటికి వెళ్లిన చిరంజీవి అక్కడ ఇందిరా దేవి చిత్రపటానికి నివాళులు అర్పించారు. కృష్ణతో మాట్లాడారు. మహేశ్ బాబును ఓదార్చారు. ఇందిరా దేవి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. 

అటు, తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇందిరా దేవి చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. మహేశ్ బాబు, కృష్ణలను పరామర్శించారు.
Chiranjeevi
Krishna
Mahesh Babu
Indira Devi
Demise

More Telugu News